పవన్ కళ్యాణ్‌కు భయపడే వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలను రద్దు చేశారంటూ ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జి సునీల్ దేవ్‌ధర్ తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఏపీ రవాణాశాఖా మంత్రి పేర్ని నాని, తెల్లవారుజామున 5 గంటలకు లేచి వచ్చి షోలు వేయమంటే వేయరు సునీల్ గారూ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. మీరు కరోనా వ్యాక్సిన్‌తో పాటు రేబిస్ వ్యాక్సిన్ కూడా వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్, ప్లీజ్ సెండ్ రేబిస్ వ్యాక్సిన్ టు మిస్టర్ నాని స్టేట్ ట్రాన్స్ పోర్టు మినిష్టర్, వ్యాక్సిన్ డొనేట్ చేయాలనుకునేవారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ..అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి.
అనేక వివాదాలకు తెరతీసింది..
వకీల్ సాబ్ సినిమా ఏపీలో అనేక వివాదాలకు తెరతీసింది. గతంలో అధిక ధరలకు టికెట్లు అమ్ముకుని బెనిఫిట్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. వకీల్ సాబ్ రిలీజ్‌కు ముందు బెనిఫిట్ షోలు రద్దు చేయడంతో పాటు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవని అధికారులు ధియోటర్ల యాజమాన్యాలను హెచ్చరించారు. అప్పటికే ఆన్ లైన్లో అధిక ధరలకు అమ్మిన టికెట్ల డబ్బును కూడా వెనక్కు ఇప్పించారు. దీనిపై తాజాగా నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
Must Read ;- నాగబాబుకు పేర్నినాని ట్వీట్ ఫర్ టాట్
మీకు ఏమి అయ్యింది నాని గారు.మీరు కారోనా వాక్సిన్ తో పాటు రాబిస్ వాక్సిన్ వేసుకోవాలి.ఇట్స్ అర్జంట్.please సెండ్ రాబిస్ వాక్సిన్ to మిస్టర్ నాని.స్టేట్ transposrt మినిస్టర్.వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పెరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ. pic.twitter.com/4mkGm7NLeg
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 11, 2021