‘వకీల్ సాబ్’ సినిమా ఎలా ఉన్నా సర్కారుకూ, మెగా కుటుంబానికీ మధ్య ట్వీట్ల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇది ఓ పాచిపోయిన సినిమా అని ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించడం మెగా బ్రదర్ నాగబాబుకు ఎక్కడో కాలినట్టుంది. వెంటనే ఓ ట్వీట్ చేసి పారేశారు. అసలు ఈ వివాదానికి కారణం ఈ సినిమా బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వకపోవడం. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహోదగ్రులయ్యారు. ఈ వ్యవహారానికి భాజపా మద్దతు పలికింది. పవన్ కు మద్దతుగా భాజపా నేతలు గళం కలిపారు. ఈ కామెంట్లకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇవ్వడంతో వివాదం ముదిరిపాకాన పడింది. రాజకీయాలకూ, సినిమాలకూ సంబంధం ఉండదని ఆయన అన్నారు.
చట్ట ప్రకారం నాలుగు ఆటలకే అనుమతి ఉంటుందని, అభిమానులకు దురద ఉందని తెల్లవారు జామున 5 గంటలకు వెళితే షో వెయ్యరని ఆయన బదులిచ్చారు. పైగా ఇది పాచిపోయిన సినిమా అన్నారు. దీంతో నాగబాబు కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ‘మీకేమైంది నాని గారు. మీరు కారోనా వాక్సిన్‌తో పాటు రేబిస్ వాక్సిన్ కూడా వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. ప్లీజ్ సెండ్ రేబిస్ వాక్సిన్ టు మిస్టర్ నాని.. స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్. వ్యాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ’ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.
నాగబాబు ఇంత ఘాటుగా ట్వీట్ చేస్తే మంత్రి గారు ఊరుకుంటారా.. ‘‘పరోపకారి పాపన్న నాగబాబు గారూ పేర్నినాని లాంటి బయటివారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్ కు రాబిస్ వ్యాక్సిన్ చాలా అవసరం.. వెంటనే వెతికి వేయించండి. ఆలస్యమైతే మీకు కూడా అవసరమౌతుంది. అన్నదమ్ములిద్దరికీ వ్యాధి తగ్గిన తరువాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాడు’ అంటూ ఘాటుగా జవాబిచ్చారు. నాగబాబుకు పేర్ని నాని ఇచ్చిన జవాబు చూసి కొందరు ట్వీట్ ఫర్ టాట్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Must Read ;- రేపటి నుంచి వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరలు పెంచవద్దు.. హైకోర్టు
మీకు ఏమి అయ్యింది నాని గారు.మీరు కారోనా వాక్సిన్ తో పాటు రాబిస్ వాక్సిన్ వేసుకోవాలి.ఇట్స్ అర్జంట్.please సెండ్ రాబిస్ వాక్సిన్ to మిస్టర్ నాని.స్టేట్ transposrt మినిస్టర్.వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పెరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ. pic.twitter.com/4mkGm7NLeg
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 11, 2021
పరోపకారి పాపన్న @NagaBabuOffl గారు, పేర్నినాని లాంటి బయటివారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్ కు రాబిస్ వాక్సిన్ తక్షణ అవసరం వెంటనే వెతికి వేయించండి.ఆలస్యమైతే మీకు కూడా అవసరమౌతుంది.అన్నదమ్ములిద్దరికీ వ్యాధి తగ్గిన తరువాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాడు
— Perni Nani (@perni_nani) April 11, 2021