ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నానీ, సుధీర్ బాబు హీరోలుగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వి’. లాక్ డౌన్ టైమ్ లో డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా .. అంచనాల్ని అందుకోలేకపోయింది. యునానిమస్ గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నానీ కెరీర్ లోనే ఘోరమైన ఫ్లాప్ గా ముద్ర పడ్డ ఈ సినిమా ను చాలా మంది మరిచిపోయుంటారు కూడా. అలాంటి ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడింది.
‘వి’ సినిమాలోని ఒక సన్నివేశంలో ముంబై మోడల్ సాక్షి మాలిక్ ఫోటో ను వాడుకున్నారు మేకర్స్. ఆమెను సెక్స్ వర్కర్ గా చూపించారు. దాంతో తన ఫోటో ను తన పర్మిషన్ లేకుండా దర్శక, నిర్మాతలు వాడుకున్నారని ఆమె ముంబై హైకోర్ట్ లో పిటీషన్ వేసింది. తన అనుమతి లేకుండా తన ఫోటోను ఎలా వాడతారని ప్రశ్నించింది. దాంతో ముంబై కోర్టు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఆ సన్నివేశాల్ని సినిమాలో నుంచి తొలగించేవరకూ అమెజాన్ లో సినిమాను ఆపేయాల్సింది గా కోర్ట్ ఆదేశించింది.
Must Read ;- టీజర్ టాక్ : టక్ చేసుకొని తాటతీసే టక్ జగదీష్