స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు తో పాటు , మలయాళంలో మంచి క్రేజ్, మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న ‘పుష్ప’ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీర్చి దిద్ధేందుకు అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నారు. దీని తర్వాత తర్వాత కొరటాల శివ సినిమా చేస్తున్నట్లు అల్లు అర్జున్ అనౌన్స్ చేసినప్పటికీ, మరో వైపు సీరియస్ గా పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రముఖ దర్శక రచయిత ఇంద్రగంటి మోహన కృష్ణ ” జటాయువు ” అనే ఫాంటసీ కథ రాశారు. రామాయణం లోని జటాయువు కథే ఈ సినిమా. ఈ స్క్రిప్ట్ అల్లు అర్జున్ కి విపరీతంగా నచ్చినా , ఇంద్రగంటి మోహనకృష్ణ తీసిన ‘వి’ సినిమా ప్లాప్ కావడంతో.. అల్లు అర్జున్ ఇంద్రగంటి ని ఆ స్క్రిప్ట్ రైట్స్ ఇస్తే, మరో డైరెక్టర్ తో తీస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఒక దశలో ఇంద్రగంటి ‘ జటాయువు ” స్క్రిప్ట్ సురేందర్ రెడ్డి తో డైరెక్ట్ చేయించడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ సురేందర్ రెడ్డి కి తన స్క్రిప్ట్ ఇవ్వడానికి ఇంద్రగంటి ఇష్టపడలేదని తెలిసింది. సురేందర్ రెడ్డి కి ఆఫర్ ఇచ్చినా , అతను అలాంటి స్క్రిప్ట్ తీసుకు రాలేకపోయాడు అట. అయినా పాన్ ఇండియా ఫాంటసీ సబ్జెక్టు మీద ఆసక్తి చంపుకోలేని అల్లు అర్జున్ ఒకప్పటి ప్రముఖ దర్శకుడు వి. ఎన్. ఆదిత్య చెప్పిన ఒక ఫాంటసీ లైన్ ఓకే చేసినట్లు రూమర్స్ వినబడుతున్నాయి . ఆదిత్య కథ తీసుకుని , ఓ ప్రముఖ దర్శకుడితో ఆ సినిమా తీయిస్తారని అంటున్నారు. మరి ఆ దర్శకుడు ఎవరు? ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాలు తెలియాలంటే… కొద్ది రోజులు ఓపికపట్టాల్సిందే.
Must Read ;- సీనీ గవాక్షంలో ఆహా! ఏమి ఈ ‘అరవింద్’ దళాక్షం!!