నేచురల్ స్టార్ నాని ఇప్పుడు టక్ జగదీష్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి నిన్నుకోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా స్టార్ట్ చేసారు. సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఇందులో కథానాయికలు సాయిపల్లవి, కృతిశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు అంటే.. సుందరానికి అనే సినిమాకి కూడా ఓకే చెప్పారు. ఈ మూడు సినిమాలతో నాని ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇలా ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా వెబ్ సిరీస్ కూడా చేయడానికి ఓకే చెప్పాడట నానీ . నెట్ ఫ్లిక్స్ రూపొందించే ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పాడట. గత ఆరు నెలలుగా ఈ సిరీస్ కోసం నానితో డిష్కసన్స్ జరుగుతున్నాయని తెలిసింది. టక్ జగదీష్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఈ నెలలోనే శ్యామ్ సింగ రాయ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు. ఇది సెట్స్ పై ఉండగానే అంటే.. సందరానికి సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు.
ఈ మూవీ ఫినిష్ చేసి వెబ్ సిరీస్ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇది సెట్స్ పైకి రావడానికి టైమ్ పట్టచ్చు. అయితే.. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ డిఫరెంట్ గా ఉంటుంది అంటున్నారు. ప్రజెంట్ వెబ్ సిరీస్ లు చాలా వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన వెబ్ సిరీస్ లకు పూర్తి భిన్నంగా ఓ డిపరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుందట. డిఫరెంట్ గా ఉన్న కాన్సెప్ట్ నచ్చడం వలనే నాని ఓకే చెప్పాడట. త్వరలోనే దీనిని పూర్తి వివరాలతో ప్రకటించనున్నారని సమాచారం. డిజిటల్ మీడియాలో ఎంట్రీ ఇస్తున్న నాని.. అక్కడ కూడా తన మార్క్ తో సక్సస్ సాధిస్తాడేమో చూడాలి.
Must Read ;- వకీల్ సాబ్, ఉప్పెన రిలీజెస్ పై క్లారిటీ వచ్చేసింది..!











