నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టక్ జగదీష్’. కెరీర్ పరంగా నానికి ఇది 26వ చిత్రం. రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు. శివ నిర్వాణ దర్శకుడు షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సింహ భాగం చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం చివరి షెడ్యూల్ శుక్రవారం హైదరాబాద్లో మొదలైంది. చిత్రంలోని ప్రధాన తారాగణమంతా చివరి షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.
ఓ చక్కటి వినోదాత్మక కుటుంబ కథా చిత్రంగా దీనిని మలుస్తున్నట్లు దర్శక, నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాలోని ఇతరా ముఖ్య పాత్రలలో జగపతి బాబు, నరేష్, నాజర్, రావు రమేష్, , దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్,ప్రవీణ్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: ఎస్. తమన్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: సాహి సురేష్, ఫైట్స్: వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్).
Must Read ;- టాలీవుడ్ లో మరో స్టార్ వారసుడు వస్తున్నాడు..!











