విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తమిళ్ లో విజయం సాధించిన అసురన్ మూవీకి రీమేక్. ధనుష్ నటించిన ఈ సినిమా తమిళ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే.. ఈ సినిమాని తెలుగులో వెంకటేష్ చేయనున్నారని తెలిసినప్పటి నుంచి ఇది ఆయనకు సెట్ కాదు అనే కామెంట్స్ వినిపించాయి. ఈ యాక్షన్ మూవీకి లవ్ స్టోరీస్, ఫ్యామిలీ మూవీస్ తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాలను ఎంచుకోవడం పై కూడా విమర్శలు వచ్చాయి.


అయితే.. వెంకీకి పూర్తి నమ్మకం ఉండడంతో శ్రీకాంత్ అడ్డాలకు ఛాన్స్ ఇచ్చారు. ఎప్పుడైతే నారప్ప ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారో.. అప్పటి నుంచి నారప్ప పై అనుమానాలు పోయాయి అని చెప్పచ్చు. ధనుష్ చేసిన రోల్ కి వెంకీ సెట్ కాడు అనుకున్నవాళ్లు సైతం.. నారప్పగా వెంకీ భలే సెట్ అయ్యాడే అన్నారు. కరోనా ముందు అనంతపురం, తమిళనాడులో షూటింగ్ జరుపుకుంది. రీసెంట్ గా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ చేసారు. ఇదిలా ఉంటే.. రేపు అనగా డిసెంబర్ 13న వెంకీ పుట్టినరోజు. ఈ సందర్భంగా నారప్ప టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ టీజర్ లో నారప్ప పాత్రను, అతని కుటుంబాన్ని పరిచయం చేస్తారని తెలిసింది. వెంకీ సరసన ప్రియమణి, మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ నటిస్తున్నారు. సురేష్ బాబు, కలైఫులి ఎస్ థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుపుకుంటుంది. ఎఫ్ 2, వెంకీ మామ.. ఇలా వరుసగా సక్సస్ సాధిస్తుండడంతో నారప్ప పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి.. అంచనాలకు తగ్గట్టుగా నారప్ప కూడా అందర్నీ ఆకట్టుకుని సక్సస్ సాధిస్తుందని ఆశిద్దాం.
Must Read ;- ‘ఎఫ్ 3’లో ఐదుగురు హీరోయిన్లు.. ఎవరా ముద్దుగుమ్మలు?