మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మా అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ పోటీపడుతుండడం తెలిసిందే. అయితే.. ఆ నలుగురే కాకుండా.. ఐదో అభ్యర్థిగా సీవీఎల్ నరసింహారావు కూడా బరిలోకి దిగుతున్నానని ప్రకటించడం మరింత ఆసక్తిని పెంచాయని చెప్పచ్చు. తెలంగాణ వాదంతో తాను ప్యానెల్ ఏర్పాటు చేసి పోటీకి దిగుతున్నానని ఆయన స్పష్ఠంగా చెప్పారు. అవకాశాల విషయంలో తెలంగాణ వారికే కాకుండా.. ఆంద్రప్రదేశ్ వారికి కూడా అన్యాయం జరుగుతుందని.. తెలుగు వారికి న్యాయం జరగాలనేది తన వాదన అని అన్నారు.
2009లో తెలంగాణ ఆర్టిస్టులతో సపరేట్ గా మా ఏర్పాటైందని .. మా అసోసియేషన్ రెండుగా ఉండాలని సినీ పెద్దలను కోరామని కూడా తెలిపారు. ఇక మా సభ్యుల సంక్షేమం కోసం పాటుపడతానని ఆయన అన్నారు. ఆయన పోటీ చేస్తున్న విషయాన్ని వీడియో ద్వారా తెలియచేశారు. మొత్తానికి మా ఎన్నికల్లో తెలంగాణ వాదం అనేది కొత్త అంశం కాగా.. దానికి ప్రతినిధిగా సీనియర్ నటుడు పదవికి పోటీపడడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే.. మా ఎన్నికల పై బీజేపీ నాయకురాలు, సినీయర్ హీరోయిన్ విజయశాంతి స్పందించారు. సీవీఎల్ నరసింహారావు ఆవేదన న్యాయమైనదని, ధర్మమైందని ఆమె పేర్కొన్నారు.
తాను మా సభ్యురాలిని కాకపోయినా ఒక కళాకారిణిగా స్పందిస్తున్నానన్నారు. చిన్న కళాకారుల సంక్షేమం దృష్టా సీవీఎల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నానని విజయశాంతి తెలిపారు. మా ఎన్నికల గురించి విజయశాంతి స్పందించడం.. తన మద్దతు ఎవరికో చెప్పడంతో మరింత ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. మా ఎన్నికల వివాదం పై సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్‌లో మాట్లాడారు. తాను రెండు విషయాలు అడగ దలుచుకున్నానని చెప్పారు. అవి ఏంటంటే… అసలు మా ఎన్నికలను ఎవరు అనౌన్స్ చేశారని ప్రశ్నించారు.
ఇప్పుడున్న కమిటీ ఏమైనా ప్రకటించిందా?. ఏదో ప్యానల్ అని అనౌన్స్ చేశారు.. నాకదే ఆగ్రహం కలిగించింది. టైమ్ వచ్చినప్పుడు మాట్లాడవచ్చు.. ఇప్పుడది అనవసరం. ప్రకాష్‌రాజ్‌కు చిరంజీవి మద్దతిచ్చారో.. లేదో.. నాకు తెలియదు. నాగబాబు కూడా ఈ విషయం పై వ్యాఖ్యలు చేయడం సరికాదు అని కోట శ్రీనివాసరావు అన్నారు. రోజుకో ట్విస్ట్ తో మా ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు వచ్చే లోపు ఇంకెన్ని ట్విస్ట్ లు .. ఇంకెన్ని వివాదాలు వస్తాయో.. ఫైనల్ గా ఎవరు విజేతగా నిలుస్తారో అనేది కామన్ మేన్ లో సైతం క్యూరియాసిటీని పెంచేస్తోంది.
Must Read ;- షాకింగ్ చిరు మద్దతు ఇస్తున్న ప్రకాష్ రాజ్ ని సపోర్ట్ చేస్తూ వర్మ ట్వీట్స్