మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పేరోషన్ పరిధిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం పర్యటించనున్నారు. ఉదయం 7.00 గంటలకు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహా స్వామి వారిని దర్శించుకుని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. 9.00 గంటలకు గాజువాకలో జరిగే ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. 10.30 గంటలకు గాజువాకలో నిరుద్యోగ యువత , విద్యార్ధులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సరస్వతి పార్క్ సమీపంలో ఆటోడ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు భీమిలి, తగరపు వలసలలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు అనకాపల్లిలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు.
Also Read : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: నారా లోకేష్