విద్యార్థులకు దిశానిర్దేశం చేయాల్సిన వర్సిటీలు రాజకీయ కార్యాకలాపాలుగా మారుతున్నాయి. ఉన్నత విద్యను అందించి, విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను మరిచి రాజకీయ వేదికలుగా నిలుస్తున్నాయి. అందుకు నిదర్శనమే ఈ ఘటన. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గురువారం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. దీనికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు. వీసీ ప్రసాదరెడ్డి స్వయంగా కేక్ కట్ చేశారని ఆరోపించారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే వర్సిటీల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. రాజకీయాలకతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు.. జగన్ పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని మండిపడ్డారు. గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో.. 11 కేసుల్లో నిందితుడుగా ఉన్న ఏ2 రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం దారుణమన్నారు. విద్యార్థులకు ఉన్నత విలువలను బోధించే వీసీ.. దొంగల జీవితాలను ఆదర్శంగా తీసుకోమని చెప్పడం.. విద్యార్థులకు తీవ్ర అన్యాయం చెయ్యడమేనని నారా లోకేశ్ అన్నారు.
రెడ్డిది మిడిమిడి జ్ఞానం
కొవిడ్ బాధితుల కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సాధన దీక్షకు దిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ దీక్షకు ఏపీ ప్రజల నుంచి ఊహించని మద్దతు లభించింది. కరోనా పరిస్థితుల కారణంగా కొద్దిమంది నాయకులతోనే చంద్రబాబు సాధన దీక్ష చేపట్టారు. కార్తకర్తలెవరూ రావొద్దని, ఎవరి నియోజకవర్గంలో వాళ్లు దీక్ష చేయాలని ఆదేశించారు. అయితే సాధన దీక్షలో జనాలు ఎవరూ లేరని, కనీసం మీడియా కవరేజీ కూడా లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి మిడిమిడి జ్ఞానంతో విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. కొవిడ్ రూల్స్ కూడా తెలియని విజయసాయిరెడ్డి ఒక ఎంపీనా.. ? అంటూ చురకలంటించారు.
Must Read ;- పొద్దున్నే అలా ఠీవీగా!.. మధ్యాహ్నానికే ఇలా నేల వాలి!
రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు ఏ1 @ysjagan పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. ఎంతో మందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 11 సీబీఐ కేసుల్లో నిందితుడుగా ఉన్న ఏ2 రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం దారుణం.(1/2) pic.twitter.com/e3plzqVIQg
— Lokesh Nara (@naralokesh) July 2, 2021











