కరోనా నియంత్రణ, వ్యాక్సినేపన్‌లో ఫేక్ సీఎం జగన్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వారం రోజులు వ్యాక్సిన్ వేయకుండా అన్నీ ఒకే రోజు వేసి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఐఐఎంకు చెందిన ప్రొఫెసర్ ఒకరు ఏపీలో కరోనా మరణాలు ప్రభుత్వ లెక్కల కంటే 14 రెట్లు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషించారని, ఆయన పాలనకు ఇదే నిదర్శనమన్నారు. రెండేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ తప్పులను ప్రజల్లో ఎండగట్టేందుకు అనుచరించాల్సిన భవిష్యత్ కార్యచరణపై చంద్రబాబునాయుడు ఈ రోజు నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు,ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 29న వీటన్నింటిపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని దిశా నిర్ధేశం చేశారు.
ప్రకటనలకు వందల కోట్లు ఖర్చు
సీఎం జగన్ రెడ్డి అబద్దపు ప్రచారాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. పైగా వాటి ప్రచార ప్రకటనలకు వందల కోట్ల రూపాయులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. వాటి కోసం ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని అన్నారు. పది, ఇంటర్ పరీక్షల రద్దు, గ్రూప్ -1 ఉద్యోగుల ఎంపికలో అవకతవకలు, జాబ్ క్యాలెండర్ విడుదల తదితర అంశాలే దీనికి ఉదాహరణలన్నారు. పారిశ్రామిక రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించకపోవడంతో నిరుద్యోగంతో యువత ఇబ్బందులు పడుతున్నారన్నారు. బాధ్యత, సమర్థత లేని అబద్ధాల ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో యువత భవిష్యత్ ప్రమాదంలో పడిందని, దీనిపై రాష్ర వ్యాప్తంగా తెలుగుదేశం యువత, విద్యార్థి విభాగాలు జగన్‌రెడ్డి వైఫల్యాలను నిలదీస్తున్నాయన్నారు.
క్షీణించిన శాంతి భద్రతలు
సీఎం నివాసం ఉండే తాడేపల్లికి కూతవేటు దూరంలోని సీతానగరంలో యువతిని రేప్ చేశారంటే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సెటిల్ మెంట్లు, ఫ్యాక్షన్ హత్యలు , గంజాయి స్మగ్గింగ్ లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పెరిగాయని అన్నారు.
టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాస్, టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, జీవీ ఆంజనేయులు, జ్యోతుల నెహ్రూ,అబ్దుల్ అజీజ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాలవ శ్రీనివాసులు తదితరులు సమావేశంలో పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వారి ప్రాంతాల్లో వైసీపీ సర్కారు టీడీపీ నాయకులు, సానుభూతి పరులపై చేస్తున్న కక్ష సాధింపు చర్యలను తెలిపారు.
Must Read ;- డూబురెడ్డి డాబు జాబ్ కాలెండర్ : నారా లోకేష్