అధికారం అండగా ఉందని రెచ్చిపోతే.. దానికి రెండింతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రెండేళ్ల జగన్‌రెడ్డి పాలనలో అరాచకాలు, విధ్వంసాలే మండిపడ్డారు. అమరావతి మండలం ఉంగుటూరు సర్పంచ్ అనూరాధ భర్త సోమశేఖర్, అతని అనుచరులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తామంటే.. వైసీపీ నాయకులు దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. గ్రామంలో భయానక వాతావరణం సృష్టించిన వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదుచేసినా స్పందించకపోవడం అన్యాయం అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులపై పడిన ప్రతీ దెబ్బకి మూల్యం చెల్లించుకోక తప్పదని, అందరి ఖాతాలు సెటిల్ చేస్తామని హెచ్చరించారు.
Must Read ;- అమరావతిపై ఎందుకు అంత ద్వేషం.. పదివేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?
అమరావతి మండలం ఉంగుటూరు సర్పంచ్ అనూరాధ చెరువు మరమ్మతుల పనులు ఆరంభానికి ప్రయత్నించగా, అడ్డుకున్న వైసీపీ నాయకులు శివ గ్యాంగ్ సర్పంచ్ భర్త సోమశేఖర్, అతని అనుచరులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, అంతుచూస్తామని హెచ్చరించడం వైసీపీ అరాచకాలకు అద్దం పడుతోంది.
— Lokesh Nara (@naralokesh) June 14, 2021