నువ్వు ఏ బ్రాండ్ తాగాలో ఆయనే డిసైడ్ చేస్తాడు. ఏది తాగితే నీకు కిక్కు ఎక్కుతుందో ఆయనే ఫైనల్ చేస్తాడు. అప్పుడే ఆయనకు కూడా కిక్కు ఎక్కుతుంది. సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయమంటే.. వెబ్ సైట్స్ డెవలప్ చేసి కొత్త కొత్త లోకల్ చీప్ బ్రాండ్స్ లండన్‌దని.. న్యూయార్క్‌దని కంపెనీలు తయారు చేసి అందులో చూపిస్తాడు. ఫారెన్ బ్రాండ్స్ రానీయకుండా చేసి.. ఈ ఫాలెన్ బ్రాండ్స్‌ని తన చేతితోనే అందిస్తున్నాడు. ఐటీని అభివృద్ధి చేయమని పదవినిస్తే.. దానికన్నా మేటిగా మద్యం వ్యాపారం డెవలప్ చేసి అభినందనలు అందుకుంటున్నాడు.. అందుకు తగ్గ తాంబూలం కూడా నమిలేస్తున్నాడు.
ఆ క్రియేటివ్ ఆర్టిస్ట్ కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
మద్యం షాపులో సుప్రీం, ప్రెసిడెంట్ ఇలా విచిత్రమైన పేర్లతో బ్రాండ్లు వస్తుంటే ఆ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఎవరా అని అందరూ అనుకున్నారు. ఆ ఆర్టిస్ట్ పేరు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. సార్ ఐటీ సలహాదారు. కాని కంప్యూటర్ కన్నా కంపెనీ మందుపైనే ఫోకస్ ఎక్కువ. మద్యం బ్రాండ్లు కొత్త కొత్తవి తయారు చేసి..అవే అమ్మేలా మద్యం షాపుల్లో కండిషన్లు పెట్టించి.. కోట్లలో వ్యాపారం చేయిస్తున్నాడంట. నెలకు రూ.40 కోట్లు తాంబూలం సార్‌కే అందుతుందంట. ఇంతకీ ఎవరీ కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి?
ఆయనను పెట్టింది విజయసాయిరెడ్డే..
సార్ మాంచి ఎద్యుకేటేడ్. కాలిఫోర్నియాలో పని చేశారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ప్రశాంత్ కిషోర్ టీమ్‌లో పని చేశారంట. ఇక ఎన్నికలు అయిపోయి ఫలితాలు రాగానే ఐటీ సలహాదారుడనే మెడల్ వచ్చి మెడలో పడింది. సరే కాలిఫోర్నియాలో పని చేశాడు కదా.. ఏదో ఇరగదీస్తాడు ఒరగబెడతాడని అనుకున్నారు. కాని బాస్ ఫోకస్ అంతా మద్యం వ్యాపారం మీద ఉందన్న సంగతి అప్పటికి ఆయనను పెట్టిన వారికి కూడా తెలియదు. ఆయనను పెట్టింది ఎవరనుకుంటున్నారు విజయసాయిరెడ్డి. ఈ మల్టీ ట్యాలెంటెడ్ నేత రిఫరెన్స్ ఇచ్చారంటే ఈయనకు కూడా మల్టీ ట్యాలెంట్ ఉంటుందని ఊహించలేకపోయారు పాపం.
ఈయన గారు బ్రాండ్ల పేర్లు పెట్టిమరీ ప్రొడక్షన్ చేయించాడు. దాని కోసం పెట్టిన డిస్టిలరీ కంపెనీల్లో డైరెక్టర్ మళ్లీ మన విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి కంపెనీలో కూడా డైరెక్టర్. అంటే అర్ధమైందిగా.. సిలక లింకులు ఇవే అన్నమాట. అటు గురువుగారికి కంపెనీ ద్వారా డబ్బులు అందిస్తూ..అంతా పర్‌ఫెక్టుగా వ్యాపారం చేయిస్తున్నందుకు ఈయన కూడా భారీగానే అందుకుంటున్నాడంట.
మద్య నిషేధంలో జగనన్న మాట తప్పడట..
ఆ బ్రాండ్లు ఏ పాటివో… డేంజరో కాదో జనానికి తెలియదు. వాళ్లు టైముకు తాగాలి అంతే..అప్పటికి షాపులో వాడు ఏదిస్తే అది తీసుకుని తాగటమే. ఏమన్నా అయితే గియితే తర్వాత చూసుకోవడమే. అసలు మద్య నిషేధం అని హామీ ఇచ్చినవాడు మద్యం షాపులు నడిపించటం ఏంటో…అసలు మందు లేకుండా చేస్తానన్నవాడు తమవాళ్లతో డిస్టిలరీ కంపెనీలు పెట్టి లోకల్ బ్రాండ్లను తయారు చేయడం ఏంటో..వాటిని మళ్లీ నిర్బంధంగా జనాలకు అంటగట్టి సొమ్ము చేసుకోవడం ఏంటో.. ఇన్ని చూశాక మద్య నిషేధం విధిస్తానన్న జగనన్న మాట తప్పడు.. మడమ తిప్పడని అభిమానులు జై కొట్టడం ఏమిటో… ఐటీ సలహాదారుడి పదవిలో ఉన్నవాడు మద్యం సలహాదారుడుగా పనిచేయడం ఏంటో.. అందుకు నెలకు రూ.40 కోట్లు కొట్టేయడం ఏంటో… ఇవన్నీ చూస్తుంటే మనం కూడా ఆ బ్రాండ్ రెండు పెగ్గులు కొట్టేసి ..అవన్నీ మర్చిపోవటం మంచిదనిపిస్తుంది.
Must Read ;- రాజా రిపోర్టు ఇస్తే.. ఆఫీసరైనా,ఎమ్మెల్యే అయినా ఔటే