పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో కమ్ బ్యాక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయి.. ఏప్రిల్ 9న విడుదల కానుండగా.. ఇప్పుడు ఆయన అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ మూవీ, హరీశ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా , సురేంద్ర రెడ్డి సినిమా .. ఇలా పలు రకాల జోనర్స్ లోని చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే పవర్ స్టార్ నటిస్తోన్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 27వ సినిమా గా తెరకెక్కుతోన్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుంది.
మొఘలాయిల పరిపాలనలో మన భారతదేశం స్థితిగతుల్ని ఈ సినిమాతో ఆవిష్కరించబోతున్నారు దర్శకుడు క్రిష్. ఇందులో పవర్ స్టార్ ఓ గజదొంగ పాత్రను పోషిస్తున్నారు. కోహినూర్ వజ్రం బ్యాక్ డ్రాప్ లో సాగే ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ను .. ఏయమ్ రత్నం నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ను మార్చ్ 11న రివీల్ చేయబోతున్నారు మేకర్స్. దాంతో అభిమానులు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ ప్రచారం లో ఉంది. మరి నిజంగానే ఆ టైటిల్ నిర్ణయిస్తారో లేదో తెలియాలంటే.. మార్చ్ 11 వరకూ ఆగాల్సిందే.
Must Read ;- పవన్ కోసం స్టోరీ రెడీ చేస్తున్న విజయేంద్రప్రసాద్