కార్ల పై పిచ్చి, వెర్రి ఉన్న హీరోలు తను మనసుపడిన కారు ఎంత కాస్ట్ లీ అయినా.. కొనేసి విలాసంగా విహరించాలని కోరుకుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్న టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ యన్టీఆర్. మనోడికి విలాసవంతమైన కార్లంటే.. మక్కువ ఎక్కువ. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా.. దాని గురించి కూపీ లాగి.. కొనేసేదాకా నిద్ర పట్టదట అతడికి. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఓ కారు అతడి కళ్ళపడిందట. దాని పేరు లాంబోర్గిని ఉరుస్. దీని కాస్ట్ అక్షరాలా రూ. 5 కోట్లు.
ఇండియాలో ఉన్న అత్యంత విలాస వంతమైన ఖరీదైన కార్లలో లాంబోర్గినీ ఉరుస్ ఒకటి. త్వరలోనే ఓ ప్రముఖ ఛానల్ లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో తదుపరి సీజన్ మొదలు కాబోతోంది. దీనికి హోస్ట్ గా చేయడానికి తారక్ అంగీకరించాడట. ఆ షో కోసం అందుకోనున్న పారితోషికంతో లాంబోర్గినీ ఉరుస్ కారు ను బుక్ చేశాడట. త్వరలోనే ఈ కార్ ఇండియాలో ల్యాండ్ కాబోతోందని సమాచారం. ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
Must Read ;- ఎన్టీఆర్ తో సంజయ్ దత్ జతకడితే ఎలా ఉంటుందో?