బెయిల్ పై విడుదల అయిన ఎంపీ రఘురామ ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. అక్కడ ఆయనకు మెరుగైన చికిత్స అందుతోంది. అయితే రఘురామరాజు అరెస్ట్ తీరుపై ఎన్ హెచ్ఆర్సీ (జాతీయ మానవ హక్కుల కమిషన్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. రఘురామరాజు అరెస్ట్ తీరుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. రఘురామ కాలు వేలు ఫ్యాక్చర్ కావడం, గాయాలు కూడా ఉండటంతో వెంటనే సరైన విచారణ చేపట్టాలని సూచించింది. జూన్ 7 లో ఒక నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే రఘురామరాజు కుమారుడు ఫిర్యాదు ఇవ్వడంతో ఎన్ హెచ్ఆర్సీ స్పందించింది.
Must Read ;- రఘురామ రెండు కాళ్లకు బ్యాండేజ్.. రెండు వారాలు నడవద్దన్న ఎయిమ్స్ వైద్యులు











