వైసీపీ ఎంపీ రఘురామరాజుకు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు.ఆయన పాదాల్లో డెడ్ సెల్స్ గుర్తించారు. రెండు కాళ్లూ బాగా దెబ్బతిన్నాయని బ్యాండేజ్ కట్టారు.రెండు వారాల పాటు కనీసం నడవటానికి కూడా వీల్లేదని డాక్టర్లు తెలిపారు.ఇప్పుడు కనుక కాలిపై బరువు వేస్తే,గాయాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. వారం పాటు సికింద్రాబాద్ ఆర్మీ మెడికల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న రఘురామరాజు బెయిల్‌పై డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న రఘురామరాజు ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు.కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి హర్షవర్ధన్ రఘురామరాజు ఆరోగ్యంపై ఫోన్ చేసి మాట్లాడటంతో పాటు,ఎంపీకి సరైన వైద్యం అందించాలని ఎయిమ్స్ డైరెక్టర్‌ను ఆదేశించారు.దీంతో ఎయిమ్స్ డైరెక్టర్ దగ్గరుండి వైద్య పరీక్షలు నిర్వహించారు.
రెండు వారాలు కదలడానికి వీల్లేదు
ఎంపీ రఘురామరాజు పాదాల్లో మృతకణాలు,దెబ్బతిన్న కణాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య పరీక్షల్లో ఎయిమ్స్ డాక్టర్లు గుర్తించారు.రెండు కాళ్లకు బ్యాండేజ్ కట్టిన వైద్యులు,రెండు వారాలపాటు కదలడానికి వీల్లేదని చెప్పారు.కాళ్లపై ఎట్టి పరిస్థితుల్లో బరువు వేయడానికి వీల్లేదని చెప్పడంతో రఘురామను వీల్ చైర్‌లో తీసుకువెళ్లారు.ఇప్పుడు సీరియస్ గా వైద్యం తీసుకోకపోతే అది ముదిరిపోయి మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు.అయితే రఘురామరాజు కాళ్లకు కొట్టడం వల్ల గాయాలు అయ్యాయా? లేదా అనే విషయం మాత్రం ఎయిమ్స్ డాక్టర్లు వెల్లడించలేదు.
Must Read ;- అనుకూల నివేదిక కోసం వైద్యులపై ఒత్తిడి.. తన వద్ద సాక్ష్యాలున్నాయన్న ఆర్కే











