బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దీపిక పదుకొనే ఒకరు. దేశవ్యాప్తంగా ఆమెకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె అభిమానుల్లో వివిధ భాషలకు చెందిన స్టార్ హీరోలు .. హీరోయిన్లు ఉన్నారంటే ఆమె ప్రత్యేకత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. భారతీయ సినిమా పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం అందుకునే అతి తక్కువమంది కథానాయికలలో ఆమె ఒకరు. ఆమె లైఫ్ లో ఒక రోజు కాదు .. కొన్ని గంటలు కూడా చాలా విలువైనవే. అలాంటి దీపిక తన చెల్లెలి కోసం చాలా సమయాన్ని కేటాయించడం విశేషం.
దీపికా పదుకొనేకి ..అనీషా పదుకొనే అనే ఒక చెల్లెలు ఉంది .. నిన్న ఆమె పుట్టినరోజు. చెల్లెలి కోసం బెంగుళూర్ వెళ్లిన దీపిక, దగ్గరుండి ఆమె బర్త్ డే వేడుకకు సంబంధించిన పనులు చూడటం విశేషం. చెల్లెలితో కేక్ కట్ చేయించడమే కాకుండా, ఆమెతో కలిసి దిగిన ఒక సెల్ఫీని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చెల్లెలికి సోషల్ మీడియా ద్వారా కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సెల్ఫీలో దీపిక భుజంపై ఆమె చెల్లెలు ఆప్యాయంగా వాలిపోవడం చూడొచ్చు. అక్కా చెల్లెళ్ల బంధానికి ఈ సెల్ఫీ అద్దం పడుతోంది.
మొదటి నుంచి కూడా దీపికకు చెల్లెలు అనీషా అంటే చాలా ఇష్టమట. తను ఎక్కడ ఎంత బిజీగా ఉన్నప్పటికీ చెల్లెలికి కాల్ చేస్తూనే ఉంటుంది. అంతేకాదు సినిమా షూటింగులతో ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ, చెల్లెలిని కలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతుంది. తన జీవితంలో తన చెల్లెలి పాత్ర ప్రత్యేకమైందనీ .. ప్రాముఖ్యత కలిగినదని దీపికా తరచూ చెబుతూ ఉంటుంది. తాము కలుసుకున్నప్పుడల్లా ఈ ప్రపంచాన్ని మరిచిపోతుంటామని అంటూ ఉంటుంది. చెల్లెలి పట్ల దీపిక చూపిస్తున్న ప్రేమనురాగాలకు అభిమానులంతా ఫిదా అవుతున్నారు.
Must Read ;- అందాల వలలో బంధించేస్తున్న బాలీవుడ్ భామ











