25 అడుగుల లోతుల పడిపోయిన ఆర్టీసీ బస్సు..!
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి మండలం పరిధిలో జల్లేరు వద్ద అదుపుతప్పి ఆర్టీసీ బస్సు వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది ప్రయాణికులు అక్కడక్కడే మృతి చెందగా.. మరో ఎనిమందికి తీవ్ర గాయాలయ్యాయి. మితిమీరిన వేగం, వేగాన్ని కంట్రోలు చేసుకోలేక ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించుపోయి వేగంగా వచ్చి వంతెన రెయిలింగ్ ను బస్సు ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని డిపో మేనేజర్ రమణ పేర్కొన్నారు. సుమారు 25 అడుగుల లోతున్న వాగులో బస్సు పడిపోయింది. ఆ సమయంలో 47 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 8 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మొత్తం 9 మంది మృతి చెందగా .. మరణించిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు.
ముమ్మరంగా సహాయక చర్యలు ..
వేగంగా వచ్చి బస్సు వంతెన పై నుంచి వాగులో ఫల్టీ కొట్టింది. ఈ క్రమంలో నీటిలో నుంచి బయటకు రాలేకలేనే 9 మంది జల సమాధి అయ్యారని తెలుస్తోంది. మగిలిన వారిని కిటికీ అద్దాలను పగలుకొట్టి స్థానికులు బయటకు తీసి కాపాడారు. ఆర్డీవో, డీఎస్పీ ఆధ్వర్యంలో తక్షణ సహాయక చర్యలు కొనసాగాయి. క్షతగాత్రులను ప్రాంతీయ హాస్పటల్ కు తరలించారు. బస్సులోపల ఉన్న వారిని స్థానికులు పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు. ప్రమాద ఘనటపై సీఎం జగన్, గవర్నర్ బిస్వభూషణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం. ఈ ప్రమాదంపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు, లోకేష్ విచారం వ్యక్తం చేసి, మృతులకు సంతాపం తెలియజేశారు.
Must READ ;- మీ పెత్తనం చాలు ఆపండి ..! జగన్ సర్కార్ పై కేంద్రం సీరియస్!!











