ప్రభుత్వ చేయూత పథకానికి సహకరించలేదని కమిషనరే ఈ పని చేయించినట్టుగా ఉద్యోగులు, అధికారులు అనమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దానిపై ఇప్పటికీ స్పష్టత రాకపోయినా.. ఈ చెత్త విషయం మాత్రం నెట్టింట బాగా వైరల్ అయింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్ చేసి మరీ చెత్త గురించి బాగా తలంటినట్టున్నారు. బ్యాంకుల ముందు ఈ చెత్త పనేంటంటూ బాగానే మొట్టికాయలు వేసినట్టు తెలుస్తుంది. గార్బెజ్‌ని అక్కడి నుండి శుభ్రం చేయడానికి తగిన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అసలు కారణం ఏంటి? కారకులు ఎవరో కనుక్కుని వెంటనే చర్యలు చేపట్టాలని కూడా చెప్పినట్లు తెలుస్తుంది.
At 15:15 hrs today, spoke to Finance Minister @IamBuggana garu on garbage dumped at the entrance of bank branches in Krishna Dist, AP, inconveniencing staff & customers. He assured me that all steps will be taken to ensure safety for all. @PIB_India @pibvijayawada @DFS_India pic.twitter.com/QcMb8oFLzk
— Nirmala Sitharaman (@nsitharaman) December 24, 2020
ఖండించిన చంద్రబాబు..
ఈ చెత్త ప్రోగ్రామ్ మీడియాలో బాగా హల్ చల్ చేసింది. దీనిపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా స్పందించారు. ఇలాంటి చర్యలు చూసి షాకయ్యానన్నారు. ప్రభుత్వం చెప్పిన పనులు చేయకపోతే ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించారు? ఇలాంటి చర్యల వల్ల దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారుతుందని, ఇలాంటి చర్యలు అనాగరికతను తలపిస్తున్నాయని చెప్పుకొచ్చారు.
Must Read ;- ‘చెత్త’ ఐడియా : జగన్ జమానాలో బ్యాంకులకూ బెదిరింపులు
Shocking! Officials dumped garbage outside banks in Krishna Dist for not toeing the line of AP State Govt. This depraved & callous state-sponsored act will reflect badly on our State's reputation. Where is the state headed with such outrageously uncivil actions? pic.twitter.com/Z0nOn85Fj8
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) December 25, 2020