టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ మూవీ నిర్మిస్తున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. రీసెంట్ గా వెంకీ – వరుణ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ‘ఎఫ్ 3’ మూవీని స్టార్ట్ చేసారు. ఈ మూవీని కూడా సమ్మర్ కి రిలీజ్ చేయాలనేది దిల్ రాజు ప్లాన్. ఇక నాగచైతన్యతో థాంక్యూ మూవీని నిర్మిస్తున్నారు.

‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కూడా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే… ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేయాలనుకుంటే.. ఎవరూ ఖాళీగా లేరు. అందరూ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందుకే అనుకుంట.. దిల్ రాజు కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. అసలు దిల్ రాజుకు మంచి పేరు తీసుకువచ్చినవి అవే. మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తారని పేరు వచ్చింది. ఆతర్వాత స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేయడంతో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు.. చిన్న సినిమాలను పక్కన పెట్టేసారు.
మళ్లీ ఇప్పుడు తనకు ఎంతో పేరు తీసుకువచ్చిన కాన్సెప్ట్ బేస్డే మూవీస్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. దీని కోసం ఓ టీమ్ ని కూడా సెట్ చేసారట. త్వరలోనే దిల్ రాజు బ్యానర్ నుంచి మిడియమ్ బడ్జెట్ మూవీస్, చిన్న సినిమాలు వస్తాయి అంటున్నారు. దీని వలన ఎంతో మంది అవకాశం లభిస్తుంది. మరి.. రూటు మార్చిన దిల్ రాజు గతంలో వలే వరుస విజయాలు సాధిస్తారేమో చూడాలి.
Must Read ;- ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాకపోవడానికి కారణం ఏంటో.?