దర్శకధీరుడు రాజమౌళీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రస్తుతం సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ను భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. టాలీవుడ్ క్రేజీ హీరోలు యన్టీఆర్, రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమా పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అలాగే.. ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న డైలీ అప్టేట్స్ , రూమర్స్ కూడా అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ రూమర్ ఒకటి.. ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఆర్.ఆర్.ఆర్ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ మూవీ సెట్స్ కు పవన్ కళ్యాణ్ వచ్చారని, ఆయనతో జక్కన్న కొంత టైమ్ ముచ్చటించారని తెలిసింది. అయితే దీనికి సంబంధించిన ఫోటోస్ ను మాత్రం బైటికి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. అందుకే ఈ రూమర్ స్ప్రెడ్ అయిందని అంటున్నారు.
గతంలో రామ్ చరణ్ , జక్కన్న కాంబో మూవీ మగధీరలో మోగాస్టార్ చిరంజీవి గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ మూవీలో పవర్ స్టార్ ను అతిథి పాత్రలో చూపించబోతున్నాడని అంటున్నారు. ఇందులో నిజానిజాలేంటో తెలియదు కానీ.. రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటి వరకూ పవర్ స్టార్ నటించలేదు. ఆ లోటును ఈ విధంగానైనా భర్తీ అవుతోందని అభిమానులు సంబర పడుతున్నారు. మరి నిజంగానే పవన్ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారో లేదో తెలియాలంటే.. అక్టోబర్ 13 వరకూ ఆగాల్సిందే.
Must Read ;- పవన్ కళ్యాణ్ పాత్ర ‘గని’ పేరుతో వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్