పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈరోజు (జనవరి 29) ప్రారంభమ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో ఈ సమావేశాలు మొదలయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే 16 పార్టీలుప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఐకమత్యమే మన బలం. ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత మనదే. కేంద్ర పథకాలు నిరుపేద మహిళలకు ఆసరాగా నిలిచాయి. ప్రణబ్ ముఖర్జీకి నివాళులు అర్పిస్తున్నాను. ఆర్థిక సవాళ్లను సమర్థవంతంగా ఎదర్కొంటున్నాం. గత ఆరేళ్లలో ఆరోగ్య రంగంలో చేపట్టిన సంస్కరణలు కరోనా సమయంలో దాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడింది. ఉపాధి కోల్పోయిన కూలీలను ఆదుకున్నాం. రిపబ్లిక్ డే నాటి ఘటన దురదృష్టకరం. శాంతి భద్రత సమస్యలను తేలికగా తీసుకోవద్దు.
ఫిబ్రవరి1న బడ్జెట్..
అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పిస్తారు. ఈ సారి బడ్జెట్ కాగిత రహితంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో.. అధికారిక పత్రాలను సభకు సమర్పించిన వెంటనే బడ్జెట్, ఆర్థిక సర్వే ఆన్‌లైన్లో అందుబాటులోకి వస్తాయని లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి ఒకటిన ఆర్థికమంత్రి లోక్‌సభలో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా సమావేశాలు జరగనున్నందున రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సమావేశాలు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనున్నాయి. రెండు విడతలుగా జరిగనున్న ఈ సమావేశాల్లో.. తొలి విడత శుక్రవారం నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండో దశ మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి.
33 పనిదినాలు..
ఈసారి మొత్తం 33 పనిదినాల పాటు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, 30న ప్రధాని మోదీ, 31న రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. వర్షాకాల సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా సభ్యులు రెండు సభల్లో కూర్చోనున్నారు. సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి చేయనున్న ప్రసంగం కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో 144 మంది సభ్యులను మాత్రమే అనుమతించనున్నారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సహా 1209 మంది సిబ్బందికి ఇప్పటికే కరోనా టెస్టులు నిర్వహించినట్టు రాజ్యసభ సచివాలయ వర్గాలు చెప్పాయి.
Must Read ;- బడ్జెట్‌కి.. హల్వాకి.. లింకేంటి?











