టాలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ‘మా నగరం, ఖైదీ’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న అతడు.. రీసెంట్ గా దళపతి విజయ్, విజయ్ సేతుపతితో మలిచిన మాస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఈ సినిమా మంచి సక్సెసే నమోదు చేసింది. ప్రస్తుతం ఈ దర్శకుడు కమల్ హాసన్ తో విక్రమ్ అనే మూవీ తీస్తున్నాడు.
ప్రస్తుతం లోకేష్ తో సినిమాలు చేయడానికి టాలీవుడ్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో లోకేశ్ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ కాంబోను సెట్ చేయబోతోందట. ఆ మేరకు లోకేష్ కు రూ. 5 కోట్ల డీల్ సెట్ చేశారట. రామ్ చరణ్ తో ఓ అదిరిపోయే యాక్షన్ మూవీని తెరకెక్కించేందుకు లోకేష్ రెడీ అవుతున్నాడని టాక్.
ప్రస్తుతం రామ్ చరణ్ ..రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ లో యన్టీఆర్ తో స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు తండ్రి చిరంజీవితో ఆచార్య లో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇక దీని తర్వాత తమిళ దర్శకుడు శంకర్ తో ఓ పాన్ ఇండియా మూవీకి సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమాకు రెడీ అవుతాడట. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే.. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకూ ఆగాల్సిందే.
Must Read ;- రామ్ చరణ్, శంకర్ సినిమా ఆలస్యమేనా?