కరోనాసెకండ్ వేవ్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు కరోనా బారిన పడి హోమ్ ఐషోలేషన్ కు వెళ్ళారు. ఇప్పుడా లిస్ట్ లోకి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా చేరారు. ఆయనకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. వకీల్ సాబ్ గ్రాండ్ సక్సెస్ సంబరాల్లో మునిగి తేలుతున్న దిల్ రాజు.. అభిమానుల్ని కలవడం, ప్రెస్ మీట్స్ నిర్వహించడం .. నటీనటుల్ని కలవడం.. డిస్ట్రిబ్యూటర్స్ ను మీట్ అవడం.. చేయడంతో ఇప్పుడు ఇండస్రీలో అందరూ కలవర పడుతున్నారు.
దిల్ రాజు తనకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలియజేసి.. గత కొద్దిరోజులుగా తనతో ట్రావెల్ చేసిన వారు వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవాలని చెప్పారు. దాంతో దిల్ రాజు వెంటే తిరిగిన పలువురు ఆందోళన చెందుతున్నారు . ఇటీవల నివేదా థామస్, అంజలి లాంటి నటీమణులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. వారి ద్వారానే కరోనా దిల్ రాజుకీ వ్యాపించి ఉంటుందని చెప్పుకుంటున్నారు.
అలాగే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ముందు జాగ్రత్త తో .. హోమ్ ఐసోలేషన్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వకీల్ సాబ్ విజయం సాధించిన సందర్భంగా.. దిల్ రాజుని, దర్శకుడు వేణు శ్రీరామ్ ని సత్కరించారు. దీంతో ఆయనలో కూడా కంగారు మొదలైంది. అంతేకాదు.. వేణు శ్రీరామ్ కొద్ది రోజులుగా దిల్ రాజుతోనే ఉంటున్నాడు.
Must Read ;- బన్నీతో ‘ఐకాన్’ తీస్తానంటోన్న దిల్ రాజు