పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ను కరోనా కనికరించిందనే అనుకోవాలి. విడుదల విషయంలో ఒక్క వారం తేడా వచ్చినా కలెక్షన్లపై వేటు పడేదే. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు లక్కీ అనుకోవాలి. కోవిడ్ తర్వాత థియేటర్లు ప్రారంభమైన అనంతరం విడుదలైన పెద్ద సినిమా ‘వకీల్ సాబ్’ మాత్రమే. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ తో పరిస్థితులన్నీ తల్లకిందులయ్యాయి.
థియేటర్లు మూతపడే ముందు ఉన్న పెద్ద సినిమా కూడా ఇదే. ఇప్పుడీ సినిమా ఓటీటీకి కూడా వరంగా మారిందనే అనుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ సినిమాని థియేటర్లలో చూడలేకపోయారు. దానికి కారణం కోవిడ్ భయం. దాంతో దీన్ని మేలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది.
దీన్ని ఎప్పుడు విడుదల చేయాలనే విషయంలో కొత్త ఒప్పందం జరిగినట్టు సమాచారం. సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తుంటారు. అది నిర్మాతలతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జరుగుతుంది. కానీ ఏప్రిల్ 30 నుంచి అమెజాన్ లో ఈ సినిమాని ప్రదర్శించనున్నారు. ఆ ప్రకారం చూస్తే సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలో విడుదలవుతోంది. ఈ నెల 30 నుంచే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాని చూడొచ్చన్నమాట.
Must Read ;- మళ్ళీ ‘వకీల్ సాబ్’ కాంబినేషన్ లో సినిమా ?