ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతుంటే, మరోవైపు 10వ తరగతి పరీక్షల నిర్వహిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖత్వమేనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్షలాది విద్యార్థులనే కాదు వారి కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ప్రతిష్టాత్మకమైన సీబీఎస్ఈ కూడా పరీక్షలను రద్దు చేసిందని, మరి ఏపీ ప్రభుత్వం ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. తక్షణమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని, విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలన్నారు. కరోనా తీవ్రతవల్ల ఆరోగ్య విపత్తు తలెత్తి ప్రజలందరూ తీవ్ర భయాందోళనలో ఉన్నారన్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేయకుండా, అండగా ఉండాలని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు.
Must Read ;- పరీక్షలు రద్దు చేయండి : జగన్ కు నారా లోకేశ్ లేఖ











