పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ .. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ వకీల్ గా.. ఆయన అభినయం మెప్పిస్తోంది. అయితే ఇందులో కొన్ని సన్నివేశాల్లో పవర్ స్టార్ .. తెలంగాణ యాసలో మాట్లాడి అభిమానుల్ని అలరించారు. నిజానికి ఏ ప్రాంతం స్లాంగైనా పవన్ కు కొట్టిన పిండి. అందుకే తన తదుపరి చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ రీమేక్ కోసం ఆయన రాయలసీమ స్లాంగ్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పబోతున్నారని టాక్స్ విని పిస్తున్నాయి. దీని కోసం ఆయన ఓ ప్రముఖ గీత రచయిత సహాయం తీసుకుంటారట.
ఒరిజినల్ వెర్షన్ లో బిజు మీనన్ గిరిజనుడు. ఆ పాత్రలో ఆవేశాన్ని తగ్గించడానికి ఆయన్ని పోలీస్ ఉద్యోగంలో నియమిస్తారు. ఇక తెలుగు వెర్షన్ కు వచ్చేటప్పటికీ.. ఆ పాత్రకు రాయలసీమ బ్యాక్ డ్రాప్ ను యాడ్ చేస్తున్నారట. అంటే ఆ పాత్ర ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి పోలీస్ ఉద్యోగంలోకి వచ్చినట్టు మార్పులు చేస్తున్నారట. అందుకే ఆ పాత్ర రాయలసీమ స్లాంగ్ లో పవర్ ఫుల్ గా డైలాగ్స్ చెబుతుందట. అంతేకాదు ఇందులో పవన్ ఓ జానపద గీతం కూడా పాడతారట. యస్.యస్.తమన్ రీసెంట్ గా ఆ విషయం తెలియజేసిన సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో పవన్ రాయలసీమ స్లాంగ్ అభిమానుల్ని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.