తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి హిందువు కాదంటూ బీజేపీ ఏపీ ఇన్ చార్జి సునీల్ దియోధర్ ఆరోపించారు. నామినేషన్ వేసే ముందు ఆయన ఓ పాస్టర్ ఆశీర్వాదం తీసుకున్నారని పేర్కొన్నారు. ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ వర్తించదని, ఉప ఎన్నికలో గురుమూర్తి అభ్యర్థిత్వం చెల్లదని ఆయన అన్నారు. ఈ విషయమై త్వరలో కోర్టు కెళ్తానని సునీల్ దియోధర్ స్పష్టం చేశారు. గురుమూర్తి హిందువు అయితే తిరుమల శ్రీవారిని ఎందుకు దర్శించుకోలేదని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై గురుమూర్తి కూడా స్పందించారు. తాను హిందువునని, శ్రీవారిని దర్శించుకున్నానని వీడియోలు నా దగ్గర ఉన్నాయని సమాధానమిచ్చారు.
Must Read ;- ఉద్దేశపూర్వకంగానే ‘వకీల్ సాబ్’ ను అడ్డుకున్నారు : బీజేపీ నేత సునీల్ దియోదర్










