కేంద్ర ప్రభుత్వం పెద్దలతో పలు విషయాలు చర్చించడాని ఢిల్లీ దారి పట్టిన పవన్, నాదెండ్ల.. తమ పర్యటన విషయాలను మీడియాకు వెల్లడించారు. కేంద్రం వెల్లడించిన ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా కేంద్రాన్ని కోరాము. వారు ఇంకా సమాచారం సేకరించాల్సిందిగా వెల్లడించారు. సానకూల స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాము.
జగన్ వైఖరి స్పష్టం చేయాలి..
ప్రజలను మభ్య పెట్టడానికి లేఖ రాసినంత మాత్రానా ఏం ఉపయోగం ఉండదని పవన్ తెలిపారు. ఏదీ ప్రజలను మభ్య పెట్టాలని ఒక లేఖ రాసీ ఊరుకుంటే సరిపోదని.. వారి ప్రభుత్వ వైఖరి స్పష్టంగా తెలిపినపుడే.. కేంద్రం నుంచి సానుకూల స్పందన లభిస్తుందని మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ది ఉంటే.. వారి ప్రజల పక్షాన నిలబడాలని నిర్ణయించుకుంటే.. ప్రభుత్వం తరపున కేంద్రాన్ని సంప్రదిస్తే.. కచ్చితంగా కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. గత రెండు రోజులుగా మేము కలిసిన కేంద్ర పెద్దలకు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వివరించాము. అది తెలుగు ప్రజల మనోభావాలతో ముడిపడినది చెప్పాము. వారు కూడా కొంత సమయం అడిగారు. విశాఖ గురించి చర్చించే సమయంలో సానుకూలంగా స్పందించారు.
Must Read ;-అమిత్ షాను కలిసిన పవన్ కళ్యాణ్.. ఏమిటీ చర్చ?











