పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సమ్మర్ లో వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.
అయితే.. ‘వకీల్ సాబ్’ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో భారీ పిరియాడిక్ మూవీ స్టార్ట్ చేశారు. సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ కోసం ఇటీవల పవన్ డేట్స్ కేటాయించడం.. రీసెంట్ గా పవన్ పై రెండు పాటలు చిత్రీకరించడం జరిగింది. ‘వకీల్ సాబ్’ తర్వాత ఈ సినిమానే రిలీజ్ అవుతుంది అనుకున్నారు కానీ.. ఇది భారీ పిరియాడిక్ మూవీ కాబట్టి భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువుగా ఉంటుంది. అందుచేత క్రిష్ మూవీ రిలీజ్ ఆలస్యం అవుతుంది.
దీని కంటే ముందుగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీకి ఎక్కువ లోకేషన్స్ అవసరం లేదు.. అలాగే విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సినిమా షూటింగ్ మూడు లేదా నాలుగు నెలల్లోనే కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ క్రేజీ మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆగష్టు 15న ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ‘అజ్ఞాతవాసి’ తర్వాత నుంచి పవన్ మూవీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు.. సమ్మర్ లో ‘వకీల్ సాబ్’, ఆగష్టు 15న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ప్రేక్షకుల ముందుకు వస్తే.. పవర్ స్టార్ అభిమానులకు పండగే.
Must Read ;- పవర్ స్టార్ అయ్యప్పన్ గా బరిలోకి దిగారు.. !