పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా విశేషం సంతరించుకున్న సినిమా ‘వకీల్ సాబ్’. ఫస్ట్ టైమ్ పవన్ లాయర్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దర్శకుడు వేణు శ్రీరామ్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా .. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా .. స్ర్కిప్ట్ లో అవసరం మేరకు మార్పులు చేర్పులు చేశారు మేకర్స్. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఇంకా నివేదా థామస్, అంజలి , ప్రకాశ్ రాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
తమన్ సంగీతం అందిస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమా టీజర్, సింగిల్స్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటీవల టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ‘వకీల్ సాబ్’ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 3న హైద్రాబాద్ లో గ్రాండ్ గా చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ మేరకు త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. మరి నల్లకోటుతో పవర్ స్టార్ ఈ మూవీలో ఏ రేంజ్ లో విజృంభిస్తారో చూడాలి.
Also Read :‘వకీల్ సాబ్’ కామిక్ బుక్.. సోషల్ మీడియాలో వైరల్