స్థానిక ఎన్నికల్లో ఘన విజయం.. ప్రతిపక్షాన్ని అణగదొక్కి మరీ సాధించిన విజయం.. కేంద్రంలో బీజేపీ నుంచి అందుతున్న ఫుల్లు కోఆపరేషన్.. ఇవన్నీ ఇచ్చిన కిక్ తో జగన్ తన స్పీడు పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్వరూపానంద స్వామి మే 26ను విశాఖలో రాజధాని ఏర్పాటుకు ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలకు మే 26కల్లా విశాఖలో రిపోర్టు చేయాలని మౌఖికంగా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. వారి వారి వాట్సప్ గ్రూపుల్లో ఈ మెసేజ్ ఇప్పటికే ఫార్వర్డ్ అవుతోంది.
విశాఖ నుంచే ఇక జగన్మోహన్‌రెడ్డి ఫంక్షనింగ్
ఒకవైపు హైకోర్టులో ఈ విషయంపై విచారణ జరుగుతున్నప్పటికీ… క్యాంప్ ఆఫీస్ అనే పేరు లేదా మరో పేరుతో విశాఖ నుంచే ఇక జగన్మోహన్‌రెడ్డి ఫంక్షనింగ్ చేయనున్నట్లు సమాచారం. మే 26 నుంచి ఇక జగన్, ఇతర అధికారులు విశాఖ నుంచే పని చేస్తారని తెలుస్తోంది. కేవలం కొన్ని టెక్నికల్ అంశాలను అడ్డం పెట్టుకుని.. కోర్టులో అవే చూపెట్టుకుని.. అనధికారికంగా విశాఖ నుంచి రాజధాని వ్యవహారం నడిపించేస్తారని ప్రచారం నడుస్తోంది.
ఎవరు ఎంత గగ్గోలు పెట్టినా..
జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రతిపాదన పెట్టి.. ఆ తర్వాత రెండు కమిటీలతో తూతూ మంత్రంగా రిపోర్టులు ప్రకటించి.. విశాఖలోనే అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా చెప్పేశారు. దీనిపై ఎవరు ఎంత గగ్గోలు పెట్టినా.. ఆఖరికి మండలిలో టీడీపీ అడ్డుపడ్డా సరే బుల్ డోజ్ చేసేశారు. అమరావతిలో పోరాడుతున్న రాజధాని రైతులు చివరికి కోర్టు మెట్లెక్కారు. అక్కడ ఇప్పుడు విచారణ నడుస్తోంది. మధ్యలో కొన్ని డిపార్ట్ మెంట్లు మార్చాలని చూసినా.. కోర్టు జోక్యంతో ఆగాయి. కాని ఇఫ్పుడు పరిస్థితేంటో అర్ధం కాకుండా ఉంది.
మొత్తం తమ గుప్పిట్లోకి వచ్చేలా..
ఆల్రెడీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖకు ముందే వెళ్లి.. అక్కడ మొత్తం తమ గుప్పిట్లోకి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రతిపక్ష నేతలను ఏదో ఒక కేసులో ఇరికించి.. తొక్కేయాలని చూస్తున్నారు. విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో స్థానికేతరులకే 50 శాతం టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకున్నారంటే.. ఎంత ప్రీప్లాన్డ్‌గా ఉన్నారో అర్ధమవుతోంది. వారి ప్లాన్‌కు స్టీల్ ప్లాంట్ వ్యవహారం అడ్డం వచ్చిందని మొదట టెన్షన్ పడ్డారు. అందుకే నానా డ్రామాలాడారు. అయినా చివరకు ఎలక్షన్ ఇంజనీరింగ్ ముందు స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఫని చేయలేదు. వైసీపీకే మెజారిటీ స్థానాలు దక్కాయి. టీడీపీకి 30 స్థానాలు దక్కాయంటే.. అది స్టీల్ ప్లాంట్ ఉద్యమం అందించిన ఓట్లతోనే అనుకోవాలి. కాకపోతే.. స్థానికంగా టీడీపీ వ్యవస్ధాగత బలం కూడా ఒక కారణం. ఏమైనా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సైతం వైసీపీ వశమైంది.
డెసిషన్ ముందే తీసుకున్నా..
ఇంకా వారికి అడ్డేముంది? ఎటూ విజయవాడలో సైతం వైసీపీయే గెలిచింది. గుంటూరులోనే అదే గెలిచింది. సో అమరావతి ఉద్యమానికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ ఇక డిసైడ్ అయిపోయింది. ఆ డెసిషన్ ముందే తీసుకున్నా.. ఇప్పుడొచ్చిన మున్సిపల్ ఫలితాలు వారికి బలాన్నిచ్చాయి. అందుకే మే 26న విశాఖకు రాజధాని తరలిపోనున్నది. దీనిని ఎవరూ అడ్డుకోలేని పరిస్ధితి.
Also Read :తాత ఆవేశమే గాని తండ్రి ఆలోచన లేదా.. జగన్ తీరుపై విశ్లేషణలు