పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ .. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ కి యం.సీ.ఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అభిమానుల్ని బాగా అలరించింది. అలాగే.. అంతకు ముందు రిలీజైన ఓ మగువా అనే లిరికల్ సాంగ్ కూడా శ్రోతల్ని మెప్పించింది. ఈ సినిమా వచ్చే నెల్లోనే విడుదల కానున్న సందర్భంగా.. మేకర్స్ ఇప్పటి నుంచి ఈ సినిమా ప్రచారాన్ని మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈ రోజు వకీల్ సాబ్ సినిమాకి సంబంధించిన మరో లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేశారు.
సత్యమేవ జయతే అంటూ సాగే ఈ ఇన్స్ పిరేషనల్ సాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రాయగా.. ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ ఆలపించారు. తమన్ సంగీత సారధ్యంలో ఊపిరిపోసుకున్న ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటలోని ప్రతీ లైన్ .. పవన్ వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినట్టుందని అభిమానుల్ని మురిసిపోతున్నారు. బాలీవుడ్ ‘పింక్’ మూవీలోని సోల్ ను మాత్రమే తీసుకొని పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వేణు శ్రీరామ్. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో అంజలీ నటిస్తోంది. మరి వకీల్ సాబ్ ..పవర్ స్టార్ అభిమానుల్ని ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.
Must Read ;- వకీల్ సాబ్ కోసం మరో ఇద్దరు హీరోయిన్స్