మెగా బ్రదర్ నాగబాబు .. రీసెంట్ గా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెరైటీ విలన్ గెటప్ లో ఉన్న కొన్ని ఫోటోస్ ను పోస్ట్ చేశారు. అయితే సరదాగానే ఆ ఫోటోస్ ను పోస్ట్ చేశారని చాలా మంది భావించారు. తాజా సమాచారం ప్రకారం నాగబాబు .. ఆ ఫోటోస్ పోస్ట్ చేయడానికి ఓ పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. అదేంటంటే.. ఆయన త్వరలో బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇంతకీ అది ఏ సినిమానో తెలుసా? ప్రభాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో. ఒరిజినల్ లో ప్రదీప్ రావత్ పోషించిన రాజ్ బీహారీ పాత్రను నాగబాబే చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ .. వివివినాయక్ దర్శకత్వంలో హిందీ ‘ఛత్రపతి’ రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇతర కేస్టింగ్, టెక్నీషియన్స్ సెలెక్షన్ ఇంకా పూర్తి కాలేదు. అయితే .. నాగబాబు గెటప్ కు సంబంధించిన ఫోటో షూట్ జరిగినట్టు సమాచారం అందుతోంది. అందులో భాగంగానే క్లిక్ మన్న ఆయన విలన్ గెటప్స్ .. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో నిజానిజాలేంటో ఇంకా తెలియదు కానీ.. ఒకవేళ ఆయన నిజంగానే విలన్ గా క్లిక్ అయితే.. బాలీవుడ్లోనే కాకుండా.. టాలీవుడ్ లోనూ విలన్ అవకాశాలు అందుకొనే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అంటున్నారు. మరి ఈ విషయంపై నాగబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Must Read ;- అనన్యను ఒప్పించేందుకు ట్రై చేస్తున్న బెల్లంకొండ హీరో
A man's Ruth doesn't lie in his attire
The truth is how far You stretch him with your liber'
&
How Cougar you can become with your behaviour#Anger is not how I look#Anger is how I react pic.twitter.com/eR1GoM9aqx— Naga Babu Konidela (@NagaBabuOffl) March 17, 2021