ఆయన బాణం రామబాణం. వేశాడంటే తిరుగుండదు. గతంలో ప్రత్యర్ధుల మీద వేస్తుంటే జగన్ బాబు తెగ సంబరపడిపోయారు. టీవీలో ఆయన స్పీచ్ చూస్తూ చప్పట్లు కొట్టుకునేవారు. కాని ఇప్పుడు ఆ టీవీనే పగలగొట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాణాలు ఈయన మీదకొస్తున్నాయి కదా. ఆయన బాణంలో తప్పు ఎక్కడుందో వెతకలేరు.. తిరిగి మరో బాణం వేయడానికి ఛాన్స్ కూడా ఇవ్వరు. పైగా నార్మల్ జనానికి సైతం బాగా కనెక్ట్ అయిపోతాడాయన. అందుకే ఇప్పుడు జగన్ ఏం చేయాలో అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఆయనతో ఎవరన్నా మాట్లాడండిరా.. ఆయనకు కౌంటర్లు ఎలా ఇవ్వాలో అయినా ప్లాన్ చేయండిరా అని అరుస్తున్నారు. ఆయనెవరో కాదు మన ఉండవల్లి అరుణ్ కుమార్.
ఈ మాజీ ఎంపీ మహా షార్ప్
ఈ మాజీ ఎంపీ మహా షార్ప్. ఎంత షార్ప్ అంటే.. ఏదైనా చేయాలంటే ఫుల్లు స్టడీ చేసి.. ఉన్న ఈకలన్నీ పీకీ పాకం పెట్టేస్తారు. ఇప్పుడు పోలవరం మీద అదే పనిలో ఉన్నారు. వైసీపీ బీజేపీ కలిసి నాటకం ఆడుతుంటే.. ఆయన నాటకం ముందున్న తెర చించిపారేస్తున్నారు. చంద్రబాబునాయుడు ఎలాగోలా కన్విన్స్ చేసి రిజర్వాయర్ లెవెల్ పెంచి.. నష్టపరిహారం పెరిగినా కూడా ఓకె చేయించుకుంటే.. ఇప్పుడు కేంద్రం అవన్నీ కుదరవు.. రిజర్వాయర్ లెవెల్ పాతదే ఉండాలని పట్టుబట్టింది. అంతవరకే లెక్కేసి డబ్బులిస్తానని తెగేసి చెప్పింది. అయినా కిమ్మనలేదు జగనన్న. అంటే ఏమవుతుందో తెలుసు కదా.. ఆ క్లారిటీ ఉందాయనకు.

ముందు 41.5 మీటర్ల లెవెల్లో రిజర్వాయర్ కడతారంట
అందుకే తెలివిగా ముందు 41.5 మీటర్ల లెవెల్లో రిజర్వాయర్ కడతారంట.. ఆ తర్వాత 46 దాకా పెంచుకుంటూ పోతారంట.. అదే పెన్షన్ 2 వేల నుంచి 3 వేల వరకు పెంచుకుంటూ పోయినట్లు.. అది ఏమవుతుందో చూస్తున్నాంగా.. అలాగే పోలవరం కూడా అవుతుందన్నమాట. ఖచ్చితంగా ఇదే మాట ఉండవల్లి కుండబద్ధలు కొట్టి మరీ చెప్పారు. ఒకసారి రిజర్వాయర్ పూర్తయి నీళ్లు వచ్చాక.. మళ్లీ ఎత్తు పెంచే విషయం అందరూ మర్చిపోతారనేది జగన్ నమ్మకమని.. అందుకే తెలివిగా అబద్ధమాడి ముందు 41.5 మీటర్లని చెబుతున్నారని మండిపడ్డారు.
జగన్ అసలు నిజాలు చెప్పటం లేదంటూ..
జగన్ అసలు నిజాలు చెప్పటం లేదని.. జనానికి నిజాలు చెప్పి.. కేంద్రంతో పోరాడాలని.. ప్రజలకు ఎవరు తప్పు చేస్తున్నారో అర్ధం కావాలని ఉండవల్లి చెప్పుకొచ్చారు. అయితే కేంద్రంతో పోరాడే ఆలోచన కూడా జగన్ చేయలేరు.. పైగా ప్రాజెక్టు ఎంతో కొంత ముందుకు జరిగితేనే కదా.. మన మెగా ఫ్రెండ్‌కి కాస్త కాసులొచ్చి.. కొన్ని ఇటు విసురుతారు. అందుకే రాజీపడిపోయారు.
కాని ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ ఊరుకోవటం లేదే.. మొత్తం క్లారిటీగా ఏం జరిగిందో.. ఏం జరగబోతోందో జనానికి చెప్పేస్తున్నారు. ఇప్పుడు జగన్‌కి అదే టెన్షన్ పట్టుకుంది. ఈ ఉండవల్లిని ఎలా కంట్రోల్ చేయాలో మనోడికి అర్ధం కావటం లేదు. సామాజికవర్గం కలిసుంటే.. ఈపాటికి కులం రంగు అద్దేసి విమర్శల వర్షం కురిపించేసేవారు. కాని అది కాదు.. కాబట్టి అది కుదరలేదు. ఇప్పటికైతే తమ పార్టీ నేతలకు ఉండవల్లి మీద అరవటానికి పర్మిషన్ ఇచ్చేశారని తెలుస్తోంది. ఇక రేపో మాపో గుడివాడ రౌడీ రంగంలోకి దిగుతాడేమో











