స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి పుష్ప పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇందులో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. అంతా సెట్ అయ్యింది కానీ.. విలన్ ఎవరు అనేది మాత్రం ఇప్పటి వరకు కన్ ఫర్మ్ కాలేదు. ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది విలన్లు ఉంటారని సమాచారం.
సునీల్, రావు రమేష్, ముఖేష్ రుషి.. కొంత మందిని విలన్ క్యారెక్టర్స్ కి సెట్ చేశారు. అయితే.. మెయిన్ విలన్ మాత్రం ఎవరనేది ఇంకా ఫైనల్ చేయలేదు. ముందుగా తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి పేరు వినిపించింది. ఆతర్వాత విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. విజయ్ ప్లేస్ లో బాబీ సింహా పేరు వినిపించింది. ఆతర్వాత తమిళ హీరో ఆర్య పేరు గట్టిగా వినిపించింది. దాదాపుగా ఆర్య ఈ సినిమాలో విలన్ గా నటించడం ఖాయం అనుకున్నారు.
అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఆర్య కూడా ఫైనల్ కాలేదని తెలిసింది. ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ పేరు వినిపిస్తుంది. ఇది పాన్ ఇండియా మూవీ. అందుచేత విలన్ క్యారెక్టర్ కి బాలీవుడ్ నుంచి తీసుకుంటే బాగుంటుందని.. బాబీ డియోల్ అయితే.. టాలీవుడ్ కి కొత్త కాబట్టి బాగుంటుందని సుకుమార్ ఆలోచన అట. త్వరలోనే విలన్ ఎవరు అనేది ఫైనల్ చేయాలి. లేదంటే.. షూటింగ్ కి బాగా ఆలస్యం అవ్వచ్చు. అందుచేత పుష్ప విలన్ ఎవరు అనేది త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం.
Must Read ;- పుష్ప విలన్ పై పుకార్లకు ఫుల్ స్టాప్ పడేదెప్పుడు?











