ఈ మధ్య కాలంలో ఎటుచూసిన డ్రగ్స్ మాటే వినిపిస్తుంది. సుషాంత్ మరణం కేసు విచారణలో భాగంగా మొదలైన విచారణలో.. ఎన్నో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు జరిపిన దాడుల్లో దాదాపు 200 కేజీల గంజాయి ఉన్న ఒక కొరియర్ పార్శిల్‌ని బంద్రా ప్రాంతంలో పట్టుకున్నారు.
ఇందుకు సంబంధించిన ఇద్దురు భారతీయులను, ఒక బ్రిటిష్ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. రహీలా, సైస్టా ఫర్నిచర్‌వాలా అనే అక్కచెల్లెల్లను ఈ కేసులో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. గతంలో రహీలా ఫర్నిచర్‌వాలాను సుషాంత్ కేసులో పోలీసులు ప్రశ్నించడం గమనార్హం. అంతేకాదు, రహీలా, ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా మాజీ మేనేజర్ కావడం గమనించాల్సిన విషయం. ఇక బ్రిటిష్ వ్యక్తి కరణ్ సంజిని బిజినెస్ పేరుతో 15 నెలలుగా ముంబైలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని, ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు.
Must Read ;- డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ తెలుగు హీరోయిన్ ఎవరు.?