నా యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ అయ్యింది మొర్రో అంటూ మొత్తుకుంటోంది యాంకర్ లాస్య. లాస్య టాక్స్ పేరుతో ఆమె యూట్యూబ్ ఛానెల్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇటీవలే బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చాక కూడా సెలబ్రిటీల ఇళ్లకు వెళ్లి వీడియోలు పోస్టు చేసింది. తన అభిమానులు, ఫాలొవర్లతో ఎప్పటికప్పుడు ఆమె టచ్ లో ఉంటుంటుంది. ఆమె ఛానెల్ కు దాదాపు ఎనిమిదన్నర మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
అకస్మాతుగా ఆమె ఛానెల్ కనిపించకపోయేసరికి వీక్షకులు ఆమెకు చెందిన సోషల్ మీడియా సైట్లలో మెసేజ్ లు పెట్టారు. వెంటనే అలెర్ట్ అయిన లాస్య తమ ఛానెల్ వ్యవహారాలు చూసే టెక్నికల్ సిబ్బందిని సంప్రదించారు. హ్యాక్ అయిన విషయం తెలియగానే ఓ వీడియో చేసి తన ఆవేదనను పంచుకున్నారు.
Must Read ;- బిగ్ బాస్ లో తనని కట్టప్ప లా చూడటం తట్టుకోలేకపోయిందట!