టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య వరుస కథలను ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకు వైవిద్యం ఉండేలా ప్లాన్ చేస్తుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ‘ఛలో’ సినిమా తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతున్న నాగ శౌర్య కొంచెం గ్యాప్ తీసుకోని తన సొంత బ్యానర్ లో ‘అశ్వత్థామ’ సినిమా చేసాడు. రమణ తేజ దర్శకత్వం అందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్ళీ తన సొంత బ్యానర్ లోనే మరొక సినిమా చేయనున్నాడు.
ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం అనేకమంది హీరోయిన్ల పేర్లును పరిశీలించిన నాగ శౌర్య చివరికి షిర్లీ సేతియాను ఎంపిక చేసాడు. ఈ సినిమాలో హీరోకు యాక్టింగ్ పరంగా ఎంత స్కోప్ ఉందో సమానంగా హీరోయిన్ కు కూడా అంతే స్కోప్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. అసలు షిర్లీ సేతియా ఒక పాపులర్ పాప్ సింగర్. ఆక్లాండ్ కు చెందిన ఈమె ఫోర్బ్స్ మ్యాగజైన్ లో కూడా స్థానం సంపాదించుకుంది. నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ అయిన ‘మస్కా’తో ఈ అమ్మడు నటిగా మారింది. అంతే కాకుండా ఈమె ‘నికమ్మా’ సినిమా ద్వారా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది.
ఇక నాగ శౌర్య – షిర్లీ సేతియా జంటగా చేస్తున్న సినిమాకు సంబంధించిన విషయాలను త్వరలోనే నిర్మాతలు ప్రకటిస్తారని సమాచారం. ఈ చిత్రం వైవిధ్యమైన కథాంశంతో సాగుతుందని టాలీవుడ్ టాక్. ‘అశ్వత్థామ’ కథకు మించిన ఒక కొత్తరకం స్టోరీతో నాగ శౌర్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని సమాచారం. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి వెళ్లనున్నదని టాక్. ఈ చిత్రంతో మరో మంచి విజయం అందుకోవాలని నాగ శౌర్య భావిస్తున్నాడు. మరి తను అనుకున్నట్లు ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
Must Read ;- పెద్ద బ్యానర్లో నాగశౌర్య.. గెస్టురోల్ కు అగ్ర హీరో











