టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఇతర పార్టీల నాయకులతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనతో టచ్ లో ఉన్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాకు టీఆర్ఎస్ నేతల ఈటలతో భేటీ అయ్యారు. వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక, తిరుపతి రెడ్డి మంగళవారం ఉదయం కలిశారు. ఇటీవల మంత్రి గంగులను కలిసి మద్దతు తెలిపిన రేణుక… రెండు రోజులకే ఈటల గూటికి చేరి టీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎంతకాలం సాగవని, హుజూరాబాద్ ప్రజలు ఎవరికీ తలవంచరని ఈటల అన్నారు. నాగార్జున సాగర్ లో గెలిచినట్టు.. ఇక్కడ గెలవలేరని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
Must Read ;- అన్ని పార్టీల నేతలతో చర్చలు.. ఈటల రూటు ఎటో..!