పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. కమ్ బ్యాక్ మూమెంట్ చాలా స్పీడ్ గా సాగుతోంది. కొత్త కొత్త కాంబినేషన్స్ తో వరుస సినిమాల్ని సెట్ చేసుకుంటూ.. రెండు మూడు సినిమాల్ని ఒకేసారి ట్రాక్ ఎక్కిస్తూ.. అభిమానుల్ని ఖుషీ చేస్తున్నారు. ఈ మధ్యనే ‘వకీల్ సాబ్’ టాకీ పార్ట్ పూర్తి చేసిన పవర్ స్టార్ .. ఒక పక్క క్రిష్ ‘హరిహర వీరమల్లు’, అయ్యప్పనుమ్ కోషియుమ్ మలయాళ రీమేక్ మూవీలోనూ సైమల్ టేనియస్ గా నటిస్తున్నారు. అలాగే.. తదుపరి సినిమాల్నీ ఒక కొలిక్కి తెస్తున్నారు. అందులో హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా ఒకటి.
‘గబ్బర్ సింగ్’ తర్వాత పవర్ స్టార్.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అలాగే ఇందులో పవన్ పాత్ర మీద కూడా అభిమానులు చాలా ఆత్రుతగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఇందులో పవన్ కాలేజ్ లెక్చరర్ గా నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఆ పాత్ర తో ఒక సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నాడట హరీశ్.
మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ ,ఠాగూర్ సినిమాల తరహాలో సమాజానికి మంచి చేసే లెక్చరర్ గా ఇందులో పవన్ కనిపిస్తారట. ఆయన రాజకీయ నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కథను రెడీ చేశాడట దర్శకుడు. అతి త్వరలోనే ఈ సినిమా లాంచ్ కాబోతోందని వార్తలొస్తున్నాయి. మరి ఈ మూవీతో పవర్ స్టార్ కాలేజీ కుర్రోళ్ళకి ఏ రేంజ్ లో క్లాసులు పీకుతారో చూడాలి.
Must Read ;- పవర్ స్టార్ కి పెంచల దాస్ డైలాగ్స్ ?