బాహుబలి సినిమాతో ప్రభాస్ చరిత్ర సృష్టించడంతో ఆతర్వాత ఎలాంటి సినిమా చేస్తాడు..? బాహుబలితో వచ్చిన ఇమేజ్ కి తగ్గ ప్రాజెక్టులు చేస్తాడా..? లేక తెలుగు ఆడియన్సే టార్గెట్ గా సినిమాలు చేస్తాడా అనుకున్నారు కానీ… ప్రభాస్ మాత్రం వరుసగా పాన్ ఇండియా సినిమాలు ఎనౌన్స్ చేస్తూ.. సర్ ఫ్రైజ్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ మూవీ చేయనున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ… అఫిషియల్ గా ఎనౌన్స్ చేసాడు. ఈ పాన్ ఇండియా మూవీని హంభాలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తుంది.
ఈ మూవీకి సలార్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. టైటిల్ తో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. గన్ తో స్టైల్ గా కూర్చోన్న ప్రభాస్ స్టిల్ చూస్తుంటే… ఈ సినిమా ఎంత మాస్ గా ఉంటుందో.. ఇందులో ఎంత యాక్షన్ ఉంటుందో ఊహించుకోవచ్చు. కేజీఎఫ్ మూవీలో హీరో యశ్ ను ఎంత పవర్ ఫుల్ గా చూపించారో తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ చేసిన ఒక్క పోస్టర్ తోనే ప్రభాస్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందో చెప్పకనే చెప్పేసారు. ప్రభాస్ నటించిన సాహో సినిమా యాక్షన్ మూవీ అయినప్పటికీ అది నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది కానీ.. సౌత్ ఆడియన్స్ ని ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేదు.
రాథేశ్యామ్ పిరియాడిక్ లవ్ స్టోరీ… ఇందులో ప్రధానం ప్రేమకథ. అంతే కానీ యాక్షన్ కాదు. అలాగే ఆదిపురుష్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో చేయనున్న మూవీ కూడా డిఫరెంట్ జోనర్ లో ఉంటాయి. ఇప్పుడు ఎనౌన్స్ చేసిన సలార్ మూవీ పక్కా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ అభిమానుల కోసం చేస్తున్న మూవీ అనిపిస్తుంది. మరి… ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.