MAA Elections 2021 :
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు మూడు నెలల సమయం ఉన్నప్పటికీ.. ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నానని ప్రకటించడం.. అంతే కాకుండా తన ప్యానల్ ని ప్రకటించడం తెలిసిందే. ఆతర్వాత మంచు విష్ణు, జీవిత, హేమ, సి.వి.ఎల్. నరసింహారావు పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ఇదంతా మీడియానే చేస్తోంది అన్నట్టుగా మాట్లాడారు. ఈ ఎన్నికలకూ రాజకీయ నాయకులకూ లింకు పెడుతున్నారు..? తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లను కూడా ఇందులోకి లాగారు అని అన్నారు. బొమ్మరిల్లు సినిమాలో డైలాగ్ లా.. మొత్తం మీరే చేశారు అంటూ మీడియా పైనే సెటైర్లు వేశారు.
ఇప్పటి నుంచి ఎన్నికల వచ్చే వరకు నేను కానీ.. తన ప్యానల్ సభ్యులు కానీ.. మీడియాతో మాట్లాడం అని.. ఎవరూ దయచేసి ఇంటర్ వ్యూలు, లైవ్ డిబేట్ లకు పిలవద్దు అని ప్రకాష్ రాజ్ చెప్పారు. అయితే.. ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నుంచి మా ఎన్నికల వివాదం మరింత ముదిరింది. ఈ ఎన్నికల గురించి రోజుకో వార్త బయటకు రావడం జరిగింది. ఈ వివాదం ముదురుతుండడంతో సినిమా పెద్దలు ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ప్రకాష్ రాజ్ కి ఏకగ్రీవం కావడం ఇష్టం లేదు అనుకుంటా.. ట్విట్టర్ లో ఎలక్షన్స్ ఎప్పుడు..? అని ట్వీట్ చేశారు.
MAA Elections 2021 :
దీనిని బట్టి ప్రకాష్ రాజ్ మా ఎన్నికలు వచ్చే వరకు ఆగలేకపోతున్నారనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ ఇలా ట్వీట్ చేయడం పై విమర్శలు వస్తున్నాయి. ఎలక్షన్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు..? ఎలక్షన్స్ ఎప్పుడో తెలియకుండానే ప్యానల్ ప్రకటించారా..? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరి.. ఆగలేకపోతున్న ప్రకాష్ రాజ్.. ఇలాంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.
MustRead ;- ప్రకాష్ రాజ్, నాగబాబులపై నరేష్ దూకుడు