Amitabh Bachchan Takes Part In Green India Challenge :
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్(Green India Challenge) లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా భాగమయ్యారు. ప్రస్తుతం అమితాబ్ ప్రభాస్ హీరోగా వైజయంతీ సంస్థ నిర్మించే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. సంతోష్ కుమార్ పిలుపు మేరకు మంగళవారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని అమితాబ్ మొక్కలు నాటారు. రామోజీ ఫిలిం సిటీ లో ఈ కార్యక్రమం జరిగింది.
ఇందులో అమితాబ్ తో పాటు హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి కూడా పాల్గొన్నారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ అమితాబ్ తో మొకలు నాటించి నీరు పోయించారు. భావితరాలకు ఉపయోగపడేలా మంచి కార్యక్రమాన్ని తలపెట్టారంటూ అమితాబ్ ఎంపీ సంతోష్ కుమార్ ను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలన్నారు.
Must Read ;- అమితాబ్, ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం











