అసలే లాక్ డౌన్.. పైగా రోడ్లన్నీ నిర్మానుశ్యం.. జన సంచారం అసలే లేదు. మరి ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు ఇంటి ముందు భారీగా సెక్యూరిటీ పెంచడం హాట్ టాపిక్ గా మారింది. భారీ బందోబస్తు ఏర్పాటు చేయించడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది.
కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ఎంతటివాళ్లనైనా బలి తీసుకొంటోంది. దానికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. అందుకే చాలామంది హీరోహీరోయిన్లు కరోనాకు భయపడి కఠిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు సైతం గో కరోనా గో అంటూ ఇంట్లో జపం చేస్తున్నాడు. కరోనా దరిచేరకుండా సెక్యురిటీని పెంచాడు. పనివాళ్లకు నిత్యం టెస్టులు చేయిస్తూ వైరస్ కు దూరంగా ఉంటున్నాడు. ఆన్ లైన్ లో మాత్రమే దర్శక నిర్మాతలకు టచ్ లోకి వస్తున్నాడు.
Must Read ;- ‘బ్రహ్మోత్సవం’ తర్వాత మళ్ళీ ఇద్దరు బ్యూటీస్ తో మహేశ్