సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కెరీర్ లో చాలా రేర్ గా మాత్రమే ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు. ఎప్పుడో .. కెరీర్ బిగినింగ్ లో ‘యువరాజు, టక్కరి దొంగ’ లాంటి సినిమాల్లో మాత్రమే ఇద్దరు ముద్దుగుమ్మలతో చిందులేశాడు. ఆ తర్వాత మళ్ళీ ‘బ్రహ్మోత్సవం’ లో మాత్రమే కాజల్, సమంతా లతో కలిసి నటించాడు. ఈ సినిమా పరాజయం పాలైన తర్వాత మరోసారి మహేశ్ బాబు ఇద్దరమ్మాయిలు అనే కాన్సెప్ట్ కే దూరంగా ఉన్నాడు.
ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ పుణ్యమా అని.. జంట లేడీలతో జోడీ కట్టబోతున్నాడని టాక్. మహేశ్ 28 కి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఖలేజా తర్వాత అంటే దాదాపు 11 ఏళ్ళకు మళ్ళీ ఈ కాంబో సెట్ కావడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. అలాగే.. ఈ సినిమా ఈ నెల 31న మహేశ్ తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్బంగా లాంఛ్ కాబోతోంది. ఇక ఈ సినిమాలో శిల్పశెట్టి ప్రధాన పాత్ర పోషిస్తోందని, అలాగే. సుమంత్ , సునీల్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారనే వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేశ్ 28 గురించి ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారట. త్రివిక్రమ్ రాసుకున్న స్ర్కిప్ట్ ప్రకారం ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలకు చోటుందని టాక్. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఆ ఇద్దరు ఫిమేల్ లీడ్స్ కీ సమ ప్రాధాన్యముంటుందట. అయితే ఆ హీరోయిన్స్ ఎవరనేది ఇంకా తెలియదని, కరోనా సెకండ్ వేవ్ హడావిడి తగ్గిన తర్వాత దాని మీద ఫోకస్ పెడుతున్నట్టు సమాచారం. సర్కారువారి పాట సినిమా పూర్తయిన వెంటనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కాబోతోంది. మరి మహేశ్ తో చిందేయబోయే ఆ ఇద్దరు ముద్దుగుమ్మలెవరో చూడాలి.
Must Read ;- క్రికెట్ కోచ్ గా మహేశ్ బాబు .. ఇంతకీ ఏ సినిమా? దర్శకుడెవరు?