మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు ఓకే చేస్తూ యువ హీరోలకు సవాలు విసురుతున్నారు . ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో తిరిగి మొదలుకానుంది. ఈ సినిమా తర్వాత చిరు వినాయక్ దర్శకత్వంలో ‘లూసిఫర్’, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్స్ లో నటించబోతున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతాయని సమాచారం. ఈ సినిమాల తర్వాత చిరు, బాబీతో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. 2022 వరకు చిరు డేట్స్ లేవనే చెప్పాలి. కాని అగ్ర నిర్మాత దిల్ రాజు’ చిరంజీవితో ఎలాగైనా సినిమా చేయాలని చూస్తున్నారట. చిరు డేట్స్ కోసం దిల్ రాజు ఆయన చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నరని టాలీవుడ్ టాక్
దిల్ రాజు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం బోయపాటి శ్రీనుని లాక్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. బోయపాటి చెప్పిన కథ దిల్ రాజుకు నచ్చితే వెంటనే ఆ స్టోరీని మెగాస్టార్ కు చెప్పాలని చూస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు, మెగాస్టార్ నుండి వీలైనంత త్వరగా గ్రీన్ సిగ్నల్ అందుకోవాలని అనుకుంటున్నాడని టాక్. బోయపాటిని, చిరుని కలిపి ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి కథ ఫైనల్ గా ఫిక్స్ అయిన తరువాత, మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అధికారిక ప్రకటన వస్తుందట. ఈ వార్త నిజమైతే మెగా అభిమానులు పండుగ చేసుకుంటారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే మాస్ సినిమాలు తీయడంలో బోయపాటి దిట్ట. ఇక చిరంజీవికి మాస్ లో ఉన్న ఫాలోయింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరు కలిస్తే ఆ సినిమా ఎలా ఉండబోతుందోనని ఫాన్స్ ఇప్పటి నుండే మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజముందో చూడాలి.











