బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా అలరించిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం ‘ది వైట్ టైగర్’ సినిమాలో నటిస్తోంది. భారత రచయిత అరవింద్ అడిగా రాసిన ‘ది వైట్ టైగర్’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు హాలీవుడ్ దర్శకుడు రమిన్ బహ్రాని దర్శకత్వం వహిస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని లక్ష్మణ్ గఢ్ గ్రామానికి చెందిన బల్ రామ్ హల్వాయ్ అనే వ్యక్తి చుట్టూ తిరిగే కథాంశంతో ‘ది వైట్ టైగర్’ సినిమా సాగుతూ ఉంటుంది.
ఈ చిత్రం జనవరి 22న నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మరికొన్ని థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లోని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా ట్రైలర్ ను కట్ చేశాడు దర్శకుడు రమిన్ బహ్రాని. ఇందులో ప్రియాంకతో పాటుగా నటుడు రాజ్ కుమార్ నటించాడు. వీరి యాక్టింగ్ ఈ సినిమాలో చాలా సహజంగా ఉంది. వ్యాపారం కోసం అమెరికా నుండి భారతదేశానికి వెళ్ళిన తరువాత వారి జీవితాలు ఎలా మారాయి అనేదే సినిమా కథాంశం.
పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియాంక నటించిన సినిమా ‘ది వైట్ టైగర్’ కావడం విశేషం. ఈ సినిమాపై మొదటి నుండి ప్రియాంక అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే ఆమె అభిమానుల అంచనాలు నిజమైయేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఈ సినిమా విషయంలో ప్రియాంక కూడా పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాదించి ప్రియాంక అభిమానులను ఆనందింప చేస్తుందో లేదో చూడాలి మరి.










