సీనియర్ ఐఏఎస్ లు ఎం.రవిచంద్ర, శశిభూషణ్ కుమార్, కె.సునీత, వాణీమోహన్ కు ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. వైద్య, ఆరోగ్య శాఖలో కోవిడ్ 19 నిర్వహణ, వ్యాక్సిన్ విభాగం కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర, జీఏడీలో సర్వీసులు, హెచ్ ఆర్ ఎం కార్యదర్శిగా ఉన్న శశిభూషన్, సాంఘిక సంక్షేమ కార్యదర్శి సునీతను ఆ శాఖల్లోనే ముఖ్యకార్యదర్శులుగా కొనసాగుతారు. సహకార శాఖ కమిషనర్ గా ఉన్న వాణీమోహన్ ను దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీచేశారు. ఆమెకు పురావస్తు శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఇక పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ ఎండీ అహ్మద్ బాబుకు సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్, ఆప్కో ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎక్స్ అపీషియో కార్యదర్శి ఆర్జీ శ్రీకాంత్ ను స్కిల్ డెవలప్ మెంట్ ఎండీ పోస్టు నుంచి తప్పించి రవాణా, రోడ్లు భవనాల శాఖ కు ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. స్కిల్ డెవలప్ మెంట్, ట్రైనింగ్ ముఖ్యకార్యదర్శి జి.జయలక్ష్మికి ఎండీగా పూర్తి బాధ్యతలు అప్పగింగారు. శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బదిలీలు, ప్రమోషన్ల ఉత్తర్వులు జారీ చేశారు.
Must Read ;- నిజాయితీ పరుడైతే మాకేంటి?











